Thursday, 9 July 2026
  • Home  
  • భూపాలపల్లి మండలంలో రూ.48 లక్షల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం – గ్రామీణాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు*
- జయశంకర్ భూపాలపల్లి

భూపాలపల్లి మండలంలో రూ.48 లక్షల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం – గ్రామీణాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు*

పున్నమి న్యూస్ జులై 9 : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈరోజు గురువారం భూపాలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సుమారు రూ.48 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పంబపూర్‌లో రూ.9 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవనం, గొల్లబుద్ధారంలో రూ.9 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను, శ్యామ్‌నగర్‌లో రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, మొరంచపల్లి గ్రామంలో లో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదలతో పాటు రైతులు తమ పొలాలకు సులభంగా చేరుకునేలా నాణ్యమైన రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామాల అభివృద్ధి, పరిశుభ్రతే రాష్ట్ర అభివృద్ధికి పునాదులని పేర్కొంటూ, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా, నాణ్యతతో అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సంబంధిత శాఖల అధికారులు, జిల్లా అధికారులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ జులై 9 :
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈరోజు గురువారం భూపాలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సుమారు రూ.48 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పంబపూర్‌లో రూ.9 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవనం, గొల్లబుద్ధారంలో రూ.9 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను, శ్యామ్‌నగర్‌లో రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, మొరంచపల్లి గ్రామంలో లో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభోత్సవం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదలతో పాటు రైతులు తమ పొలాలకు సులభంగా చేరుకునేలా నాణ్యమైన రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామాల అభివృద్ధి, పరిశుభ్రతే రాష్ట్ర అభివృద్ధికి పునాదులని పేర్కొంటూ, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా, నాణ్యతతో అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సంబంధిత శాఖల అధికారులు, జిల్లా అధికారులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.