నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 28 ( పున్నమి ప్రతినిధి)
నిర్మల్: భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ *రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.* అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా సయ్యద్ హైదర్ మాట్లాడుతూ.. భగత్ సింగ్ కేవలం ఒక వ్యక్తి కాదని, ఆయన ఒక విప్లవ స్ఫూర్తి అని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం 23 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. అన్యాయంపై పోరాడటం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయడమే భగత్ సింగ్కు మనం అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆప్ జిల్లా జనరల్ సెక్రటరీ సీ.హెచ్. వినోద్ కుమార్, ట్రెజరర్ అబ్దుల్ సాధిక్, వైస్ ప్రెసిడెంట్ బైండ్ల శ్రీనివాస్, నియోజకవర్గ ఇంచార్జి మెరుగు రాజన్న, టౌన్ వైస్ ప్రెసిడెంట్ సాజిద్ తదితరులు పాల్గొన్నారు.
ఇంక్విలాబ్ జిందాబాద్.. భగత్ సింగ్ అమర్ రహే!

భగత్ సింగ్ ఆశయాలే యువతకు, ఆమ్ ఆద్మీ పార్టీ కి స్ఫూర్తి – ఆప్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్
నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 28 ( పున్నమి ప్రతినిధి) నిర్మల్: భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ *రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.* అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ హైదర్ మాట్లాడుతూ.. భగత్ సింగ్ కేవలం ఒక వ్యక్తి కాదని, ఆయన ఒక విప్లవ స్ఫూర్తి అని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం 23 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. అన్యాయంపై పోరాడటం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయడమే భగత్ సింగ్కు మనం అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్ జిల్లా జనరల్ సెక్రటరీ సీ.హెచ్. వినోద్ కుమార్, ట్రెజరర్ అబ్దుల్ సాధిక్, వైస్ ప్రెసిడెంట్ బైండ్ల శ్రీనివాస్, నియోజకవర్గ ఇంచార్జి మెరుగు రాజన్న, టౌన్ వైస్ ప్రెసిడెంట్ సాజిద్ తదితరులు పాల్గొన్నారు. ఇంక్విలాబ్ జిందాబాద్.. భగత్ సింగ్ అమర్ రహే!

