గుర్రంకొండ: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామంలోని శ్రీ రెడ్డెమ్మ దేవస్థానానికి శ్రావణ మాసం తొలి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం ఆలయ అర్చకులు పంచామృత అభిషేకం నిర్వహించి, వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. రైల్వేకోడూరుకు చెందిన నాగినేని చంద్రయ్య ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ రాజన్న నాయుడు, ఈఓ మంజుల తెలిపారు.

భక్తులతో కిటకిటలాడిన శ్రీ రెడ్డెమ్మ దేవస్థానం