అనపర్తి, ఆగస్టు 11 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన జాయింట్ మండల్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (JML BC) సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై లబ్ధిదారులకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరంపై కూటమి నాయకులు, అధికారులు, బ్యాంకర్లతో కలిసి చర్చించారు.
ముద్ర లోన్స్, MSME పథకాలు, సూర్య ఘర్ పథకం, రైతులు సాగు చేస్తున్న పంటలకు పంటల బీమా, ఎల్నినో ప్రభావం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.
రైతులు, చిరు వ్యాపారులు, యువత, ఇతర అర్హులైన లబ్ధిదారులకు రుణాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి, వాటి ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.



