మహాముత్తారం మండల కేంద్రంలోని బోర్లగూడెం గ్రామంలోని రైతు హట్కర్ రాజ్యంకు చెందిన ఎద్దు ఆదివారం పిడుగుపాటుకు మృతి చెందింది. ఎద్దులను నమ్ముకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రాజ్యంకు ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సుమారు రూ.70 వేల విలువైన ఎద్దు మృతిచెందడంతో రైతు కుటుంబం ఆవేదనకు గురైంది. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు కుటుంబం కోరింది.

బోర్లగూడెంలో పిడుగుపాటుకు ఎద్దు మృతి