పున్నమి: రంగారెడ్డి జిల్లా: కర్మన్ ఘట్,
బైరామల్‌గూడలో వాహనదారులకు మరింత మెరుగైన ఇంధన సేవలు అందించే లక్ష్యంతో “టోటల్ ఎనర్జీస్ ఆటో LPG – శ్రీపాద ఫ్యూయల్స్” నూతనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆటో రిక్షా డ్రైవర్లు, ఇతర LPG వాహనదారులకు నాణ్యమైన ఇంధనాన్ని, సరైన పరిమాణంలో అందించడంతో పాటు మెరుగైన మైలేజీ పొందేలా సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
“పక్కా క్వాలిటీ – పక్కా క్వాంటిటీ – పక్కా మైలేజ్” అనే నినాదంతో శ్రీపాద ఫ్యూయల్స్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆటో వాహనదారులను ఆకట్టుకునేలా గ్యాస్ నింపించుకునే వినియోగదారులకు ఉచిత టీ అందించే సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ఆటో LPG వినియోగం ద్వారా వాహనదారులకు ఇంధన ఖర్చులను ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని, నాణ్యమైన సేవలు అందిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని పొందేందుకు కృషి చేస్తామని నిర్వాహకులు తెలిపారు. బైరామల్‌గూడ పరిసర ప్రాంతాల ఆటో డ్రైవర్లు, వాహనదారులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
బైరామల్‌గూడలో ప్రారంభమైన శ్రీపాద ఫ్యూయల్స్ ఆటో LPG కేంద్రం వాహనదారులకు అందుబాటులోకి రావడంతో స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.







