వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే వినాయక నిమజ్జన ఏర్పాట్లపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి, ఏసీపీ కిరణ్గు కుమార్, తహసీల్దార్ కృష్ణ గురువారం పట్టణంలోని పోచమ్మ చెరువు వద్ద నిమజ్జనం కోసం ఏర్పాట్లు పరిశీలించారు. నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనం రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

బెల్లంపల్లి పోచమ్మ చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన