రాజన్న సిరిసిల్ల జిల్లా ఏప్రిల్ 16 , పున్నమి ప్రతినిధి
బీసీ సాధికారిక సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షుడిగా నాళ్ల చారిని నియమించినట్లు స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగని మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా నాళ్ల చారి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు పొలాస నరేందర్, మెంగని మనోహర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యత కోసం సోషల్ మీడియా వేదికగా పనిచేస్తూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
మెంగని మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపట్టి, వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తూ సామాజిక వర్గాల హక్కుల సాధనకు కృషి చేస్తామని చెప్పారు. బీసీ హక్కుల కోసం అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నరసింహులు, కోడే శ్రీనివాస్, అక్కపెల్లి సంతోష్, విద్యాధర్, తుమ్మనపల్లి శేఖర్, సంజీవ్, సుద్దాల దేవయ్య, సురోజుల నరేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.


