జనగామ, ఆగష్టు 29,పున్నమి జిల్లా ప్రతినిధి :
భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయన కుటుంబం స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన కుటుంబ మని
22 ఏ నిషేధిత భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపై రెవెన్యూ శాఖను ఎండగడుతూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోనిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థకు 22 ఏ నిషేధిత జాబితాను అడ్డం పెట్టుకొని అక్రమంగా అనేక లావాదేవీలు జరిగాయని దీనికి నైతిక బాధ్యత వహిస్తూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని ఈ విషయాలపై అనేక ఆధారాలతోటి బిజెపి ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చర్చలకు రమ్మంటే ఆధారాలతోటి ఐదు గంటలు వేచి చూసిన కూడా రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ మంత్రి మరియు రాష్ట్ర ప్రతినిధులు చర్చకు రాకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి నిదర్శనం అని దీనిని దృష్టిలో పెట్టుకొని బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని విమర్శించడం తన అజ్ఞానానికి నిదర్శనమని బిజెపి ఫ్లోర్ లీడర్ ను ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి తనకు లేదని మాట్లాడే ముందు తమ స్థాయి తెలుసుకొని మాట్లాడాలని ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని వారు తెలిపారు 22a నిషేధిత భూముల బహిర్గతపరిచి జాబితాలో ప్రైవేటు భూములు ఉన్న నిరుపేదల రైతుల భూములు ఉన్నట్లయితే సవరించి పేదలకు రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఉడుగుల రమేష్, బొజ్జపల్లి సుభాష్, అంజి రెడ్డి నవీన్ తదితరులు పాల్గొన్నారు


