Wednesday, 23 September 2026
  • Home  
  • బీమా సఖీల ఎంపికపై మార్గదర్శకాలు-ఏపీఎం ఆంజనేయులు
- కడప

బీమా సఖీల ఎంపికపై మార్గదర్శకాలు-ఏపీఎం ఆంజనేయులు

పున్నమి న్యూస్ ప్రతినిధి: వేముల, సెప్టెంబర్ 22: వేముల మండలంలో వెలుగు సిబ్బంది, భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) అధికారులతో కన్వెర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల (SHG) మహిళా సభ్యులకు ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాలు కల్పించే “బీమా సఖీ” కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా అర్హత కలిగిన మహిళల ఎంపిక, దరఖాస్తు విధానం, శిక్షణ, LIC ఏజెంట్‌గా సేవలందించేందుకు అవసరమైన ప్రక్రియ తదితర అంశాలను వివరించారు. అర్హతలు: – మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. – వయస్సు 18 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలి. – కనీస విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణత. – LIC నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. – ఎంపికైన వారు అవసరమైన శిక్షణ పొందాలి. అర్హత కలిగిన మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించి, LIC నిబంధనల ప్రకారం పరిశీలన అనంతరం అవసరమైన IRDAI పరీక్ష నిర్వహించి, తదుపరి ఎంపిక, శిక్షణ మరియు ఏజెన్సీ ప్రక్రియను పూర్తి చేస్తారని తెలిపారు. SHG మహిళలకు ప్రత్యేక అవకాశం స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామీణ కుటుంబాలకు బీమా అవగాహన కల్పించడంతో పాటు తమకు అదనపు ఆదాయ అవకాశాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆసక్తి, అర్హత కలిగిన SHG మహిళలు సంబంధిత గ్రామ సమాఖ్య, VOA లేదా CCలను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని, LIC సూచించిన విధంగా దరఖాస్తు చేసుకోవాలని వెలుగు–DRDA, వేముల మండలం అధికారులు సూచించారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి:
వేముల, సెప్టెంబర్ 22: వేముల మండలంలో వెలుగు సిబ్బంది, భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) అధికారులతో కన్వెర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల (SHG) మహిళా సభ్యులకు ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాలు కల్పించే “బీమా సఖీ” కార్యక్రమంపై చర్చించారు.

ఈ సందర్భంగా అర్హత కలిగిన మహిళల ఎంపిక, దరఖాస్తు విధానం, శిక్షణ, LIC ఏజెంట్‌గా సేవలందించేందుకు అవసరమైన ప్రక్రియ తదితర అంశాలను వివరించారు.

అర్హతలు:

– మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
– వయస్సు 18 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలి.
– కనీస విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణత.
– LIC నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.
– ఎంపికైన వారు అవసరమైన శిక్షణ పొందాలి.

అర్హత కలిగిన మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించి, LIC నిబంధనల ప్రకారం పరిశీలన అనంతరం అవసరమైన IRDAI పరీక్ష నిర్వహించి, తదుపరి ఎంపిక, శిక్షణ మరియు ఏజెన్సీ ప్రక్రియను పూర్తి చేస్తారని తెలిపారు.

SHG మహిళలకు ప్రత్యేక అవకాశం

స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామీణ కుటుంబాలకు బీమా అవగాహన కల్పించడంతో పాటు తమకు అదనపు ఆదాయ అవకాశాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

ఆసక్తి, అర్హత కలిగిన SHG మహిళలు సంబంధిత గ్రామ సమాఖ్య, VOA లేదా CCలను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని, LIC సూచించిన విధంగా దరఖాస్తు చేసుకోవాలని వెలుగు–DRDA, వేముల మండలం అధికారులు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.