ఖమ్మం
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించనున్నట్లు ఖమ్మం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మంద సరస్వతి తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. జన్మదిన వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 17న సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య లబ్ధిదారులు, పార్టీ మద్దతుదారులు తమ ఇళ్లలో దీపాలు వెలిగించి ప్రధాని మోదీకి ఆశీస్సులు, మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. నెల రోజుల కార్యక్రమంలో పాఠశాలల్లో కళా ప్రదర్శనలు, యువ జ్యోతి యాత్రతో పాటు పలు ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంద సరస్వతి తెలిపారు.



