శ్రీ కాళహస్తి, జులై 25, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సందర్శించి, విద్యార్థినుల సమస్యలపై తక్షణమే స్పందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కూటమి ప్రభుత్వం తరఫున వసతి గృహ విద్యార్థినులకు ఉచితంగా బ్లాంకెట్లు (దుప్పట్లు), షూస్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే, అనంతరం హాస్టల్‌లో అందుతున్న సౌకర్యాలు మరియు రోజువారీ భోజన నాణ్యతపై బాలికలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వసతి గృహంలో ఫ్యాన్లు, బ్లాక్ బోర్డుల కొరత తీవ్రంగా ఉందని విద్యార్థినులు ఆయన దృష్టికి తీసుకురాగా, ఎమ్మెల్యే అప్పటికప్పుడే స్పందించి సొంతంగా కొత్త ఫ్యాన్లు, బ్లాక్ బోర్డును తెప్పించి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే పేద విద్యార్థినులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా, వారు చక్కగా చదువుకోవడానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు ఖాదర్, ప్రసాద్ విచ్చేసి విద్యార్థినులకు ఫ్యాన్లను అందజేసే ప్రక్రియలో పాల్గొని సహకరించగా, వసతి గృహ వార్డెన్, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.

బాలికల వసతి గృహానికి ఫ్యాన్లు, బ్లాక్ బోర్డులు అందజేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి