శ్రీకాళహస్తి, ఏప్రిల్ 23 (పున్నమి న్యూస్( : శ్రీకాళహస్తి పట్టణంలో స్థానిక పి.వి.ఆర్ (PVR) గ్రూప్ సంస్థలు సామాజిక బాధ్యతను చాటుకున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27) గాను తమ గ్రూప్ సంస్థలన్నింటికీ కలిపి మొత్తం రూ. 10,66,000/- ముందస్తు పన్నును శుక్రవారం మున్సిపల్ అధికారులకు చెల్లించారు. పట్టణాభివృద్ధికి పన్నులే కీలకం: ఈ సందర్భంగా పి.వి.ఆర్ గ్రూప్ డైరెక్టర్లు మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధిలో మనం చెల్లించే పన్నులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సకాలంలో పన్నులు చెల్లించి శ్రీకాళహస్తి పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి పన్నుల రూపంలో సహకరించడం వల్ల మెరుగైన మౌలిక సదుపాయాలు పొందే అవకాశం ఉంటుందని వారు తెలిపారు. అనంతరం ముందస్తు పన్నుకు సంబంధించిన చెక్కును మున్సిపల్ ఆర్.ఓ చంద్రకాంత్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పి.వి.ఆర్ గ్రూప్ డైరెక్టర్లు ముకుంద రావు జె. పవార్, పరమేశ్వర రావు వి. పవార్, మహేశ్వర రావు పడోల్కర్, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు.

బాధ్యతాయుతమైన పౌరులుగా పన్నులు చెల్లిద్దాం.. పి.వి.ఆర్ సంస్థ