Thursday, 1 October 2026
  • Home  
  • కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: కైసర్‌నగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- మేడ్చల్ – మల్కాజిగిరి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: కైసర్‌నగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కైసర్‌నగర్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా 277వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ షఫీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధులు చేసిన పోరాటాలు, త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ తదితర అనేక మంది మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని, దేశ భవిష్యత్తు కోసం యువత బాధ్యతగా వ్యవహరించాలని ఆయన అన్నారు. దేశ సమైక్యత, అభివృద్ధి, సౌభ్రాతృత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ గౌస్ పాషా, ముఫ్తీ ఇజార్ ఖాస్మీ, జీహెచ్ఎంసీ కోఆర్డినేటర్ ఫరీన్ ఖాన్, ఎండీ అజీమ్ సుల్తాన్ షేక్, ఎండీ ఆసిఫ్, ఎండీ మున్నవర్, గంగాధర్, జాఫర్, శ్రీనివాస్ గౌడ్, మహీందర్, ఎండీ ఇమ్రాన్, ఎండీ సమీర్ తదితరులు పాల్గొన్నారు Uploaded Video:

కైసర్‌నగర్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా 277వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ షఫీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధులు చేసిన పోరాటాలు, త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ తదితర అనేక మంది మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.

స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని, దేశ భవిష్యత్తు కోసం యువత బాధ్యతగా వ్యవహరించాలని ఆయన అన్నారు. దేశ సమైక్యత, అభివృద్ధి, సౌభ్రాతృత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సయ్యద్ గౌస్ పాషా, ముఫ్తీ ఇజార్ ఖాస్మీ, జీహెచ్ఎంసీ కోఆర్డినేటర్ ఫరీన్ ఖాన్, ఎండీ అజీమ్ సుల్తాన్ షేక్, ఎండీ ఆసిఫ్, ఎండీ మున్నవర్, గంగాధర్, జాఫర్, శ్రీనివాస్ గౌడ్, మహీందర్, ఎండీ ఇమ్రాన్, ఎండీ సమీర్ తదితరులు పాల్గొన్నారు

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.