*బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం*
మైలవరం (21.09.2026)
*మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం గ్రామానికి చెందిన బట్టా సాంబశివరావు సెల్లులైటీస్ వ్యాధితో బాధపడుతూ మైలవరం మహాదేవ్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ, విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ గారికి తెలియజేయగా, ఆయన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్లి కేవలం 7గం. లలో స్వయంగా దొండపాటి విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంనకు వెళ్ళి రు.1,24,436/- లు ఎల్వోసీ పేరిట మంజూరు చేయించినారు. అనంతరం మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు మంజూరైన ఎల్వోసి బాధితుడికి హాస్పిటల్ బెడ్ వద్దకు తీసుకెళ్ళి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బాధితుడు వారి కుటుంబ సభ్యులకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో మండల ఐటీడీపి అధ్యక్షుడు దొండపాటి యువరాజ్, బండారు సీతారామయ్య,మందా భాను తదితరులు పాల్గొన్నారు*




