భద్రాచలం/ ఖమ్మం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో ఖమ్మం జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు నరకుళ్ల వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్కు నరకుళ్ల వెంకటేశ్వరరావు స్వాగతం పలికి, పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కొద్దిసేపు మాట్లాడుకున్నారు. జిల్లా రాజకీయ పరిస్థితులు, రైతుల సమస్యలు, కిసాన్ మోర్చా కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సూచించినట్లు పేర్కొన్నారు.



