హైదరాబాద్: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్మెంట్లు ఆందోళనకు సిద్ధమయ్యాయి. తెలంగాణ ప్రైవేట్ పీజీ డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్ (TPDMA) ఆధ్వర్యంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల బంద్కు పిలుపునిచ్చారు. అనంతరం ఎల్లుండి రాష్ట్రంలోని పట్టణాల్లో భారీ మానవహారాలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరింది. సమస్య పరిష్కరించకపోతే తదుపరి దశలో నిరవధిక సమ్మెకు దిగుతామని మేనేజ్మెంట్లు హెచ్చరించాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.



