Wednesday, 23 September 2026
  • Home  
  • ఫీజు బకాయిలపై యువ మోర్చా ఆగ్రహం – రాస్తారోకో*
- BHADRADRI

ఫీజు బకాయిలపై యువ మోర్చా ఆగ్రహం – రాస్తారోకో*

బద్రాద్రి కొత్తగూడెం, చుంచుపల్లి మండలం, ఆగస్టు 27,( పున్నమి ప్రతినిధి) భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు *శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు*, యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగూడెం *అమరవీరుల స్తూపం–బస్టాండ్ సెంటర్* వద్ద ఫీజు బకాయిల చెల్లింపును డిమాండ్ చేస్తూ *ప్లకార్డులతో నిరసన కార్యక్రమం మరియు రాస్తారోకో* నిర్వహించడం జరిగింది. ఈ నిరసనకు యువ మోర్చా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు *శ్రీ జుజ్జూరు మోహన్ కృష్ణ గారు* నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీ జుజ్జూరు మోహన్ కృష్ణ గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి డా. జాటోత్ వెంకన్న నాయక్ గారు మాట్లాడుతూ,* రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన *సుమారు 15 వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలను* వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ బకాయిల వల్ల వేలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు. 15 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించకపోతే యువ మోర్చా ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉగ్రరూపంలో చేపడతామని హెచ్చరించారు. *ఈ కార్యక్రమంలో జిల్లా ఐటీ కన్వీనర్ భీమల్ జైన్, బలగం శ్రీధర్, చుంచుపల్లి మండల నాయకులు, పాల్వంచ టౌన్ అధ్యక్షులు రాపాక రమేష్, ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు వీర ప్రతాప్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి స్వప్న, ఎస్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మంగీలాల్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చంటి రాజ్, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు మహంకాళి శంకర్, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోల హరీష్, జిల్లా ఉపాధ్యక్షులు పొదిల్లా శ్రీను, మిట్టపల్లి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి బాలసాని శివ, జిల్లా కార్యదర్శి ధారావత్ నరేష్, భద్రాద్రి జిల్లా కార్మిక సెల్ కన్వీనర్ గుమలాపురం సత్యనారాయణ, చుంచుపల్లి మండల ప్రధాన కార్యదర్శి బుర్ర సతీష్ కుమార్, యువ మోర్చా కార్యవర్గ సభ్యులు హరి ప్రసాద్, పాల్వంచ టౌన్ జనరల్ సెక్రెటరీ బానోత్ కుమార్, తాటికొండ కళ్యాణ్, బట్టు శివ, భూక్య మోహన్, తిరుపతయ్య* తదితరులు పాల్గొన్నారు.

బద్రాద్రి కొత్తగూడెం, చుంచుపల్లి మండలం, ఆగస్టు 27,( పున్నమి ప్రతినిధి)

భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు *శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు*, యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగూడెం *అమరవీరుల స్తూపం–బస్టాండ్ సెంటర్* వద్ద ఫీజు బకాయిల చెల్లింపును డిమాండ్ చేస్తూ *ప్లకార్డులతో నిరసన కార్యక్రమం మరియు రాస్తారోకో* నిర్వహించడం జరిగింది.
ఈ నిరసనకు యువ మోర్చా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు *శ్రీ జుజ్జూరు మోహన్ కృష్ణ గారు* నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీ జుజ్జూరు మోహన్ కృష్ణ గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి డా. జాటోత్ వెంకన్న నాయక్ గారు మాట్లాడుతూ,* రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన *సుమారు 15 వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలను* వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ బకాయిల వల్ల వేలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు. 15 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించకపోతే యువ మోర్చా ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉగ్రరూపంలో చేపడతామని హెచ్చరించారు.
*ఈ కార్యక్రమంలో జిల్లా ఐటీ కన్వీనర్ భీమల్ జైన్, బలగం శ్రీధర్, చుంచుపల్లి మండల నాయకులు, పాల్వంచ టౌన్ అధ్యక్షులు రాపాక రమేష్, ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు వీర ప్రతాప్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి స్వప్న, ఎస్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మంగీలాల్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చంటి రాజ్, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు మహంకాళి శంకర్, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోల హరీష్, జిల్లా ఉపాధ్యక్షులు పొదిల్లా శ్రీను, మిట్టపల్లి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి బాలసాని శివ, జిల్లా కార్యదర్శి ధారావత్ నరేష్, భద్రాద్రి జిల్లా కార్మిక సెల్ కన్వీనర్ గుమలాపురం సత్యనారాయణ, చుంచుపల్లి మండల ప్రధాన కార్యదర్శి బుర్ర సతీష్ కుమార్, యువ మోర్చా కార్యవర్గ సభ్యులు హరి ప్రసాద్, పాల్వంచ టౌన్ జనరల్ సెక్రెటరీ బానోత్ కుమార్, తాటికొండ కళ్యాణ్, బట్టు శివ, భూక్య మోహన్, తిరుపతయ్య* తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.