శ్రీకాళహస్తి, మే 14 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ఎస్‌ఎస్‌ఆర్ అకాడమీకి చెందిన విద్యార్థి ఆకుల దక్షిత్ వివిధ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి వరుస విజయాలు సాధించాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఏపీ పాలిసెట్-2026లో 102 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 2150వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. అలాగే ఏపీఆర్‌జేసీ ఇంటర్ ప్రవేశ పరీక్షలో 112 మార్కులతో రాష్ట్రస్థాయిలో 755వ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటాడు. అదేవిధంగా నవోదయ విద్యాలయ 11వ తరగతి ప్రవేశ పరీక్షలో 53 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 13వ స్థానం పొందాడు. పదవ తరగతి వార్షిక పరీక్షల్లో కూడా 562 మార్కులు సాధించి తన ప్రతిభను నిరూపించాడు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థి దక్షిత్‌తో పాటు అతని తల్లిదండ్రులు ఆకుల దినేష్, ఆకుల హిమబిందులను అకాడమీ అధ్యాపకులు జి. మంజునాథ్, కృష్ణశ్రీ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ప్రవేశ పరీక్షల్లో విద్యార్థి దక్షిత్ ప్రతిభ