శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 08, (పున్నమి న్యూస్): మనిషి జీవితంలో ప్రయాణం ఒక అనివార్యమైన భాగమని, కాబట్టి ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పక పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (MVI) దామోదర్ నాయుడు తెలిపారు. మంగళవారం శ్రీకాళహస్తిలోని ఎస్.వి.ఎ. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, పట్టణ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో “రోడ్డు భద్రత”పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దామోదర్ నాయుడు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. అతివేగం, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ ధరించకపోవడం, మద్యం మత్తులో వాహనాలు నడపడం, డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడటం, రాంగ్ రూట్‌లో వెళ్లడం, అలసటతో నిద్రలేకుండా దూర ప్రయాణాలు చేయడం, లైసెన్స్ లేని మైనర్లు వాహనాలు నడపడం వంటి నిర్లక్ష్యాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మన కోసం ఇంట్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుంటారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. అనంతరం కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మన్యం నరసింహులు మాట్లాడుతూ, విద్యార్థులు రహదారి నియమాలపై పూర్తి అవగాహన పెంచుకోవడమే కాకుండా, తమ కుటుంబ సభ్యులకు, మిత్రులకు కూడా చైతన్యం కలిగించాలని పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడిని కళాశాల అధ్యాపకులు, రోటరీ క్లబ్ ప్రతినిధులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షురాలు ప్రమీల, ప్రధాన కార్యదర్శి మ్యాగీ క్లారా, సభ్యులు జంగారెడ్డి, కండ్రిక ఉమాలతో పాటు కళాశాల అధ్యాపకులు డాక్టర్ బాపనయ్య, డాక్టర్ వి. వాసవి, డాక్టర్ పి. గాయత్రి, డాక్టర్ పి. వేణుగోపాల్, టి. నరసింహులు, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ జి. హెన్నా, ఇతర అధ్యాపక బృందం మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రయాణంలో భద్రతా నియమాలు పాటించడం అందరి బాధ్యత-ఆర్.టి.ఓ. దామోదర్ నాయుడు