ఉదయగిరి పట్టణంలోని ఆల్తూరి రామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ చిల్డ్రన్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రామ్లో భాగంగా విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్తాల్మిక్ అసిస్టెంట్ బి. సాహితి మాట్లాడుతూ, కంటి సమస్యలు ఉన్న విద్యార్థులను గుర్తించి అవసరమైన వారికి ప్రభుత్వం ఉచితంగా కంటి అద్దాలు అందజేస్తుందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ ఉసర్తి శ్రీనివాసరావు విద్యార్థులు కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు