ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్)
స్వర్ణ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్బీఐటీ) విద్యార్థులు మరోసారి విశిష్ట గుర్తింపు పొందారు. వికసిత్ భారత్–2047 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మై భారత్ కార్యక్రమం ద్వారా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖాముఖి సంభాషించే అరుదైన అవకాశానికి ఖమ్మం జిల్లా నుంచి ఎస్బీఐటీకి చెందిన 10 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ, ఖమ్మం జిల్లా తరఫున తమ విద్యార్థులు ఎంపిక కావడం సంస్థకు గర్వకారణమని తెలిపారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా. జి. ధాత్రి విద్యార్థులను అభినందిస్తూ, విద్యతో పాటు నాయకత్వం, సామాజిక సేవ, జాతీయ స్థాయి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా కళాశాల ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తోందన్నారు. ఇటువంటి అవకాశాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, దేశాభివృద్ధిలో తమ బాధ్యతను గుర్తించేలా చేస్తాయని పేర్కొన్నారు.
వైస్ చైర్మన్ కె. శ్రీచైతన్య మాట్లాడుతూ, నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, ఆవిష్కరణలు, విలువల ఆధారిత విద్యకు ఎస్బీఐటీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డా. జి. రాజ్‌కుమార్ ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ, ఈ అవకాశాన్ని కల్పించిన ఖమ్మం కలెక్టర్ దివాకర్, జిల్లా యువ అధికారి ఎం. వెంకట్ రాంబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్లు గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, డా. ఎ.వి.వి. శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



