ఖమ్మం, మే 10
(పున్నమి ప్రతినిధి):
హైదరాబాద్లోని పరేడ్ మైదానంలో నేడు సాయంత్రం 4 గంటలకు జరగనున్న ప్రధాని Narendra Modi బహిరంగ సభకు హాజరయ్యేందుకు ఖమ్మం జిల్లా నుంచి బీజేపీ శ్రేణులు ప్రత్యేక రైలులో బయలుదేరారు.
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా హైదరాబాద్కు వస్తున్న ప్రధాని మోదీ సభను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ లో బీజేపీ ని అధికారం లోకి తేవడమే ప్రధాన లక్ష్యం అని ఆ విధంగా నేటి సభ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యొక్క దిశా నిర్దేశం ఉండబోతున్నది అని నాయకులు తెలిపారు.
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి ప్రారంభమైన ప్రత్యేక రైలును ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, రుద్ర ప్రదీప్, మోతుకూరి వెంకటనారాయణ, నున్న రవికుమార్, శ్రీమతి మంద సరస్వతి, ధనియాకుల వెంకటనారాయణ, గడీల నరేష్, రామకృష్ణ, అల్లిక అంజయ్య, దాసరి వీరభద్రం, శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ గుప్తా, వల్లల రమేష్ తదితరులు పాల్గొన్నారు.


