Wednesday, 27 May 2026
  • Home  
  • ప్రతి ఇంటి వివరాలు నమోదు చేయాలి : స్పెషల్ ఆఫీసర్ వసుమతి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రతి ఇంటి వివరాలు నమోదు చేయాలి : స్పెషల్ ఆఫీసర్ వసుమతి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 27 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల కేంద్రంలోని చంద్రమౌళి నగర్, బీసీ కాలనీలలో జరుగుతున్న జనగణనను సర్వేపల్లి నియోజకవర్గ ప్రత్యేక అధికారి వసుమతి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గృహాల సంఖ్యను ఖచ్చితంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి ఉన్నా వివరాలు సేకరించి నమోదు చేయాలన్నారు. గిరిజనులు వలస వెళ్లిన ప్రాంతాల్లో కూడా వారి వివరాలు గుర్తించి నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో జలజాక్షి, డిప్యూటీ ఎంపీడీవోలు గరుడయ్య, శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 27 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండల కేంద్రంలోని చంద్రమౌళి నగర్, బీసీ కాలనీలలో జరుగుతున్న జనగణనను సర్వేపల్లి నియోజకవర్గ ప్రత్యేక అధికారి వసుమతి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గృహాల సంఖ్యను ఖచ్చితంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి ఉన్నా వివరాలు సేకరించి నమోదు చేయాలన్నారు. గిరిజనులు వలస వెళ్లిన ప్రాంతాల్లో కూడా వారి వివరాలు గుర్తించి నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో జలజాక్షి, డిప్యూటీ ఎంపీడీవోలు గరుడయ్య, శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.