Tuesday, 25 August 2026
  • Home  
  • ప్రజాధనం పంపిణీకి ఎమ్మెల్యేలు ఎందుకు?: హైకోర్టు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రజాధనం పంపిణీకి ఎమ్మెల్యేలు ఎందుకు?: హైకోర్టు

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై విచారణ సందర్భంగా ప్రజాధనం పంపిణీలో రాజకీయ నాయకుల జోక్యంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లబ్ధిదారుల ఎంపిక, దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ వంటి ప్రక్రియలను అధికారులు నిర్వహిస్తున్నప్పుడు చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యేల పాత్ర ఎందుకని ప్రశ్నించింది. ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాలని చట్టంలోగానీ, రాజ్యాంగంలోగానీ ఉందా అని నిలదీసింది. ప్రజాధనం నుంచి ఖర్చు చేసే ప్రతి పైసాకు చట్టబద్ధత అవసరమని స్పష్టం చేసింది. అదే సమయంలో సంక్షేమ పథకాలను తాము వ్యతిరేకించడం లేదని, అర్హులైన వారికి ప్రయోజనాలు అందాల్సిందేనని ధర్మాసనం పేర్కొంది. అయితే పథకాల అమలు విధానం చట్టబద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. అభివృద్ధి కోసం ఇళ్లు, భూములు కోల్పోయిన భూసేకరణ బాధితులకు ఎనిమిది నెలలుగా పరిహారం అందకపోవడంపై కూడా న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. నిరాశ్రయులు, నిరుపేదలు, చిన్నారులు, మహిళలు వంటి వర్గాల సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించింది. వికలాంగ యువతుల వివాహానికి ఆర్థిక సాయం అందించే జీవో 4ను మాత్రం తాత్కాలిక స్టే నుంచి మినహాయించింది. ప్రభుత్వానికి పూర్తి వివరాలు సమర్పించేందుకు రెండు వారాల సమయం ఇచ్చిన ధర్మాసనం, తదుపరి విచారణను సెప్టెంబర్ 7కు వాయిదా వేసింది.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై విచారణ సందర్భంగా ప్రజాధనం పంపిణీలో రాజకీయ నాయకుల జోక్యంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లబ్ధిదారుల ఎంపిక, దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ వంటి ప్రక్రియలను అధికారులు నిర్వహిస్తున్నప్పుడు చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యేల పాత్ర ఎందుకని ప్రశ్నించింది. ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాలని చట్టంలోగానీ, రాజ్యాంగంలోగానీ ఉందా అని నిలదీసింది. ప్రజాధనం నుంచి ఖర్చు చేసే ప్రతి పైసాకు చట్టబద్ధత అవసరమని స్పష్టం చేసింది.
అదే సమయంలో సంక్షేమ పథకాలను తాము వ్యతిరేకించడం లేదని, అర్హులైన వారికి ప్రయోజనాలు అందాల్సిందేనని ధర్మాసనం పేర్కొంది. అయితే పథకాల అమలు విధానం చట్టబద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. అభివృద్ధి కోసం ఇళ్లు, భూములు కోల్పోయిన భూసేకరణ బాధితులకు ఎనిమిది నెలలుగా పరిహారం అందకపోవడంపై కూడా న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. నిరాశ్రయులు, నిరుపేదలు, చిన్నారులు, మహిళలు వంటి వర్గాల సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించింది.
వికలాంగ యువతుల వివాహానికి ఆర్థిక సాయం అందించే జీవో 4ను మాత్రం తాత్కాలిక స్టే నుంచి మినహాయించింది. ప్రభుత్వానికి పూర్తి వివరాలు సమర్పించేందుకు రెండు వారాల సమయం ఇచ్చిన ధర్మాసనం, తదుపరి విచారణను సెప్టెంబర్ 7కు వాయిదా వేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.