Wednesday, 30 September 2026
  • Home  
  • పోషణ్ మాహ్–2026 సందర్భంగా పోషకాహార అవగాహన కార్యక్రమాలు… శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్…..
- ఎన్ టి ఆర్ జిల్లా

పోషణ్ మాహ్–2026 సందర్భంగా పోషకాహార అవగాహన కార్యక్రమాలు… శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్…..

పోషణ్ మాహ్–2026 సందర్భంగా పోషకాహార అవగాహన కార్యక్రమాలు విజయవాడ:Sri Durga Malleswara Siddhartha Mahila kalasala (Autonomous), Vijayawada, Department of Food Science and Technology ఆధ్వర్యంలో పోషణ్ మాహ్–2026 కార్యక్రమాలు నిర్వహించారు. భారత ప్రభుత్వ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ఏడాది పోషణ్ మాహ్‌కు “హమారీ అంగన్‌వాడీ – హమారీ జిమ్మేదారీ”అనే ప్రధాన ఇతివృత్తాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7న ఫకీరుగూడెం అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణీలు మరియు బాలింతల కోసం పోషకాహార అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమతుల్య ఆహారం, తల్లుల ఆరోగ్యం, సరైన ఆహార ఎంపికలు, గర్భధారణ మరియు బాలింతల దశలో పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాల్సిన ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా మహిళలకు పండ్లు పంపిణీ చేసి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యతను వివరించారు. సెప్టెంబర్ 24న కళాశాల విద్యార్థుల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించేందుకు ‘న్యూట్రి-ఫెస్ట్’(Nutri Fest) నిర్వహించారు. వివిధ Nutritional games ద్వారా విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారాలు, ఆహార వర్గాలు మరియు సమతుల్య ఆహార ఎంపికలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా Food sorting, Fruit Puzzle, Nutrition Scrambling, Blind fold: Ingredients identification, నాలుగు విద్యాపరమైన ఆటలను నిర్వహించారు. ఆటల ద్వారా నేర్చుకునే విధానాన్ని అనుసరించి విద్యార్థుల్లో పోషకాహారంపై ఆసక్తిని పెంపొందించారు. సెప్టెంబర్ 29న విద్యార్థులు Nutritional Snacks development and Entrepreneurship కార్యక్రమంలో పాల్గొన్నారు. పోషక విలువలు కలిగిన ఆహార ఉత్పత్తుల తయారీ, అలంకరణ, ప్రదర్శన మరియు మార్కెటింగ్‌పై విద్యార్థులు ప్రాయోగిక నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో Chocolate cake(చాక్లెట్ కేక్), Oats -apple cinnamon cookies(ఓట్స్–యాపిల్ సినమన్ కుకీస్),Coffee muffins( కాఫీ మఫిన్స్), Coconut biscuits (కొబ్బరి బిస్కెట్లు)వంటి Nutrition snacks తయారు చేశారు. Food Science and Technology పై తమకున్న పరిజ్ఞానాన్ని సృజనాత్మకతతో అన్వయిస్తూ, వ్యాపార దృక్పథాన్ని( Entrepreneurship)పెంపొందించుకునేలా ఈ కార్యక్రమం దోహదపడింది. పోషణ్ మాహ్–2026 కార్యక్రమాల ద్వారా సమాజంలో పోషకాహార అవగాహన, విద్యార్థుల్లో ఆచరణాత్మక అభ్యాసం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ప్రోత్సాహం మరియు ఆహార ఉత్పత్తుల తయారీలో సృజనాత్మకత పెంపొందించేందుకు కృషి చేశారు.

పోషణ్ మాహ్–2026 సందర్భంగా పోషకాహార అవగాహన కార్యక్రమాలు

విజయవాడ:Sri Durga Malleswara Siddhartha Mahila kalasala (Autonomous), Vijayawada, Department of Food Science and Technology ఆధ్వర్యంలో పోషణ్ మాహ్–2026 కార్యక్రమాలు నిర్వహించారు.

భారత ప్రభుత్వ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ఏడాది పోషణ్ మాహ్‌కు “హమారీ అంగన్‌వాడీ – హమారీ జిమ్మేదారీ”అనే ప్రధాన ఇతివృత్తాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7న ఫకీరుగూడెం అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణీలు మరియు బాలింతల కోసం పోషకాహార అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సమతుల్య ఆహారం, తల్లుల ఆరోగ్యం, సరైన ఆహార ఎంపికలు, గర్భధారణ మరియు బాలింతల దశలో పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాల్సిన ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా మహిళలకు పండ్లు పంపిణీ చేసి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యతను వివరించారు.

సెప్టెంబర్ 24న కళాశాల విద్యార్థుల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించేందుకు ‘న్యూట్రి-ఫెస్ట్’(Nutri Fest) నిర్వహించారు. వివిధ Nutritional games ద్వారా విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారాలు, ఆహార వర్గాలు మరియు సమతుల్య ఆహార ఎంపికలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా Food sorting, Fruit Puzzle, Nutrition Scrambling, Blind fold: Ingredients identification, నాలుగు విద్యాపరమైన ఆటలను నిర్వహించారు. ఆటల ద్వారా నేర్చుకునే విధానాన్ని అనుసరించి విద్యార్థుల్లో పోషకాహారంపై ఆసక్తిని పెంపొందించారు.

సెప్టెంబర్ 29న విద్యార్థులు Nutritional Snacks development and Entrepreneurship కార్యక్రమంలో పాల్గొన్నారు. పోషక విలువలు కలిగిన ఆహార ఉత్పత్తుల తయారీ, అలంకరణ, ప్రదర్శన మరియు మార్కెటింగ్‌పై విద్యార్థులు ప్రాయోగిక నైపుణ్యాలను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో Chocolate cake(చాక్లెట్ కేక్), Oats -apple cinnamon cookies(ఓట్స్–యాపిల్ సినమన్ కుకీస్),Coffee muffins( కాఫీ మఫిన్స్), Coconut biscuits (కొబ్బరి బిస్కెట్లు)వంటి Nutrition snacks తయారు చేశారు. Food Science and Technology పై తమకున్న పరిజ్ఞానాన్ని సృజనాత్మకతతో అన్వయిస్తూ, వ్యాపార దృక్పథాన్ని( Entrepreneurship)పెంపొందించుకునేలా ఈ కార్యక్రమం దోహదపడింది.

పోషణ్ మాహ్–2026 కార్యక్రమాల ద్వారా సమాజంలో పోషకాహార అవగాహన, విద్యార్థుల్లో ఆచరణాత్మక అభ్యాసం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ప్రోత్సాహం మరియు ఆహార ఉత్పత్తుల తయారీలో సృజనాత్మకత పెంపొందించేందుకు కృషి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.