పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలని ఐసీడీఎస్ కొండాయపాలెం సెక్టార్ సూపర్‌వైజర్ ఏ. ప్రమీలమ్మ సూచించారు. గిలకబావి సంఘం అంగన్వాడీ కేంద్రంలో శనివారం 9వ రాష్ట్రీయ పోషణ మాస ఉత్సవాలు నిర్వహించారు. చిరుధాన్యాలు, ఆకుకూరలు, పప్పుదినుసులు, పాల ఉత్పత్తులు, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని తెలిపారు. పోషక పదార్థాల ప్రదర్శన ద్వారా వాటి ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్ సుజన, హెల్పర్ కమల, గర్భిణీలు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు.

పోషకాహారంతోనే తల్లీబిడ్డల ఆరోగ్యం:ఏ.ప్రమీలమ్మ