Thursday, 1 October 2026
  • Home  
  • పోలీస్ శాఖలో దశాబ్దాలుగా నిజాయితీగా సేవలందించిన ఎ ఎస్సై జనార్ధనకు – కొత్తవలస సీఐ టీవీ. విజయకుమార్ ఆధ్వర్యంలో ఘన వీడ్కోలు
- విజయనగరం 

పోలీస్ శాఖలో దశాబ్దాలుగా నిజాయితీగా సేవలందించిన ఎ ఎస్సై జనార్ధనకు – కొత్తవలస సీఐ టీవీ. విజయకుమార్ ఆధ్వర్యంలో ఘన వీడ్కోలు

కొత్తవలసలో పోలీస్ శాఖలో దశాబ్దాలుగా నిజాయితీగా సేవలందించిన ఎ ఎస్‌ఐ జనార్దన్‌కు ఘన వీడ్కోలు విజయనగరం జిల్లా బ్యూరో రమణ సెప్టెంబర్ 29 పున్నమి ప్రతినిధి విజయనగరం జిల్లా కొత్తవలసలో పోలీస్ శాఖలో దశాబ్దాలుగా నిజాయితీగా, నిబద్ధతతో సేవలందించిన ఏఎస్‌ఐ జనార్దన్‌కు పదవీ విరమణ సందర్భంగా ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. కొత్తవలస సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.వి. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ జనార్దన్‌తో పాటు ఎస్‌ఐ జోగారావు, ఎస్‌ఐ ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనార్దన్‌ సేవలను పోలీస్ అధికారులు, సిబ్బంది అభినందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ, సహచర పోలీసు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ చేస్తున్న జనార్దన్‌ భవిష్యత్‌ జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. జనార్దన్‌ మాట్లాడుతూ పోలీస్ శాఖలో తనకు సహకరించిన ఉన్నతాధికారులు, సహచర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పోలీస్ సిబ్బంది జనార్దన్‌ను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో ముగిసింది.

కొత్తవలసలో పోలీస్ శాఖలో దశాబ్దాలుగా నిజాయితీగా సేవలందించిన ఎ ఎస్‌ఐ జనార్దన్‌కు ఘన వీడ్కోలు
విజయనగరం జిల్లా బ్యూరో రమణ సెప్టెంబర్ 29 పున్నమి ప్రతినిధి
విజయనగరం జిల్లా కొత్తవలసలో పోలీస్ శాఖలో దశాబ్దాలుగా నిజాయితీగా, నిబద్ధతతో సేవలందించిన ఏఎస్‌ఐ జనార్దన్‌కు పదవీ విరమణ సందర్భంగా ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
కొత్తవలస సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.వి. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ జనార్దన్‌తో పాటు ఎస్‌ఐ జోగారావు, ఎస్‌ఐ ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనార్దన్‌ సేవలను పోలీస్ అధికారులు, సిబ్బంది అభినందించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ, సహచర పోలీసు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ చేస్తున్న జనార్దన్‌ భవిష్యత్‌ జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
జనార్దన్‌ మాట్లాడుతూ పోలీస్ శాఖలో తనకు సహకరించిన ఉన్నతాధికారులు, సహచర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పోలీస్ సిబ్బంది జనార్దన్‌ను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో ముగిసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.