Wednesday, 30 September 2026
  • Home  
  • పెళ్లి చేసుకోమన్నందుకు ప్రాణాలే తీశాడు
- వరంగల్

పెళ్లి చేసుకోమన్నందుకు ప్రాణాలే తీశాడు

మాదాపూర్ లోని ఒక ఓయో హోటల్లో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది మాదాపూర్ లోని ఒక ఓయో హోటల్లో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శ్రీనివాస రవితేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మృతురాలు నిఖితతో నిందితుడు శ్రీనివాస రవితేజ గత నాలుగేళ్లుగా సహజీవనం లివిన్ రిలేషన్ షిప్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. అయితే, గత కొన్నిరోజులుగా పెళ్లి విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిఖిత తనను వివాహం చేసుకోవాలని రవితేజపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలోనే హోటల్ గదిలో ఇద్దరి మధ్య మరోసారి తీవ్రమైన వివాదం చెలరేగింది.ఆగ్రహానికి గురైన శ్రీనివాస రవితేజ నిఖితపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన నిఖిత అక్కడికక్కడే మృతి చెందింది ఆమె మరణించినట్లు గ్రహించిన రవితేజ, భయంతో వెంటనే ఆ ఓయో హోటల్ నుంచి పరారయ్యాడు. హోటల్ నుంచి తప్పించుకున్న అనంతరం నిందితుడు విశాఖపట్నానికి వెళ్లాడు. అక్కడ పోలీసులు తనను పట్టుకుంటారనే భయంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడి కదలికలను గుర్తించిన మాదాపూర్ పోలీసులు, అతడిని క్షేమంగా అదుపులోకి తీసుకున్నారు. రవితేజపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, వైద్య పరీక్షల అనంతరం అతడిని న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.