విశాఖపట్నం, సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి): ఉక్కునగరం విశాఖ విమల విద్యాలయం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కమిటీ ఎన్నికలు రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలలో సందడిగా నిర్వహించారు. కమిటీ ప్రథమ ఛైర్మన్గా వడ్లపూడి కణితి కాలనీకి చెందిన ఉక్కు నిర్వాసితుడు చొప్పా నూకరాజు ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూకరాజు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సౌకర్యాల మెరుగుదలకు కృషి చేస్తానన్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజు, ప్రధానోపాధ్యాయురాలు అనిత, సీనియర్ ఉపాధ్యాయులు సత్యనారాయణ, తల్లిదండ్రులు, కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.






