లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ గ్రామంలో పారిశుద్ధ్య చర్యలకు గ్రామ సర్పంచ్ వేద ప్రణీత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. గ్రామంలోని మినీ వాటర్ ట్యాంకులను శుభ్రపరిచి, వాటికి నూతనంగా రంగులు వేయించారు. ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందేలా వాటర్ ట్యాంకుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు.
అదేవిధంగా గ్రామంలోని డ్రైన్లలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయించారు. గ్రామ పరిసరాల్లో అపరిశుభ్రత లేకుండా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామ పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు.
బాగాపూర్లో పారిశుద్ధ్యానికి పెద్దపీట.. మినీ వాటర్ ట్యాంకులకు కొత్తరూపు
లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ గ్రామంలో పారిశుద్ధ్య చర్యలకు గ్రామ సర్పంచ్ వేద ప్రణీత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. గ్రామంలోని మినీ వాటర్ ట్యాంకులను శుభ్రపరిచి, వాటికి నూతనంగా రంగులు వేయించారు. ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందేలా వాటర్ ట్యాంకుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. అదేవిధంగా గ్రామంలోని డ్రైన్లలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయించారు. గ్రామ పరిసరాల్లో అపరిశుభ్రత లేకుండా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామ పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు.

