తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలతో పాటు విజిబుల్ పోలీసింగ్, వాహన తనిఖీలు చేపట్టారు. వెంకటగిరి మల్లాలపేటలో మహిళలు, చిన్నారుల భద్రత, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధం, సైబర్ నేరాలు, చైన్ స్నాచింగ్ నివారణ, సీసీ కెమెరాల ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. బీఎన్ కండ్రిగ, బాలాయపల్లి, నాయుడుపేట ప్రాంతాల్లో హెల్మెట్ వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవ్, గంజాయి,మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రజలకు సూచనలు చేశారు. బీఎన్ కండ్రిగ, సుళ్లూరుపేట ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద కార్యకలాపాల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ సూచించారు.

పోలీసుల అవగాహన.. విజిబుల్ పోలీసింగ్