ఖమ్మం ఆగష్టు 12
(,పున్నమి ప్రతి నిధి)
బాలికపై లైంగికదాడికి పాల్పడిన పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.57 వేల జరిమానా విధిస్తూ మొదటి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి డా. పుల్లభట్ల పోగడ కృష్ణ అర్జున్ బుధవారం తీర్పు వెల్లడించారు. టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. 2023 సెప్టెంబర్ 20న పాఠశాలకు వెళ్లిన బాలికను మాయమాటలతో బయటకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడినట్లు తల్లిదండ్రుల ఫిర్యాదుతో అల్లి రాకేష్‌పై కేసు నమోదైంది. 366, 376, 506 ఐపీసీ, పోక్సో చట్టం-2012 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడిపై నేరం రుజువైనట్లు నిర్ధారించి జీవిత ఖైదు, జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు ప్రాసిక్యూటర్ జమ్ముల శరత్‌కుమార్‌రెడ్డి వాదించారు. కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌కు సహకరించిన ఇన్‌స్పెక్టర్లు కుమారస్వామి, బాలకృష్ణ, భరోసా లీగల్ ఆఫీసర్ ఉమారాణి, కోర్టు సిబ్బందిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.


