Wednesday, 22 July 2026
  • Home  
  • పొలాలకు సాగునీరు ఇవ్వాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం
- కాకినాడ

పొలాలకు సాగునీరు ఇవ్వాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం

పొలాలకు సాగునీరు ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం,తాళ్లరేవు మండల శాఖ ఆధ్వర్యంలో జల వనరుల శాఖ తాళ్ళరేవు కార్యాలయానికి విచ్చేసిన జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ కు సంఘం జిల్లా అధ్యక్షులు వళ్ళు రాజబాబు, మండల కార్యదర్శి చల్లా సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వళ్ళు రాజబాబు మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం ఖరీఫ్ సాగు మొదలైనప్పటికీ వ్యవసాయ పొలాలకు సరిగా సాగునీరు అందకపోవడం వల్ల తాళ్లరేవు మండలంలో పంట పొలాలన్నీ కొంత ఎద జల్లి మరికొంత ఆకుమడులు మరికొంత నీరు లేక ఎదురుచూస్తున్నటువంటి వరి పొలాలకు సాగునీరు తక్షణం అందజేయాలని కోరారు. వ్యవసాయ పొలాలకు సాగునీరు లేదు కానీ యానం గోదావరిలో మురుగునీరు పారుతుండడం చూస్తే ధవలేశ్వరం వద్ద సాగునీరు వృధా అవుతుందని అనుమానం ఉందని అభిప్రాయపడ్డారు. అధికారులు తక్షణమే ఈ సమస్యపై స్పందించాలని కోరారు. మండలంలో సుమారు 80 శాతం భూమిని కౌలు రైతులు సాగు చేస్తున్నప్పటికీ పెరిగిన ఎరువులు ధరలు పెరిగిన డీజిల్ ధరలు వల్ల వ్యవసాయం పెట్టుబడి విపరీతంగా పెరిగిందని అన్నారు.పెరిగిన వ్యవసాయ ఖర్చులను తట్టుకోలేక కౌలు రైతులు వలసలు పోతున్నారని ఇలా కొన్నాళ్ళు జరిగితే వ్యవసాయం చేసే రైతు బ్రతకడం కష్టమని అన్నారు. గత పంట నష్టం మరియు కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ కౌలు రైతులకు ఇవ్వని కారణంగా కౌలు రైతు బాగా నష్టపోయారని అన్నారు. ఇప్పటికే ఎకరానికి 15000 రూపాయలు పైబడి ఖర్చు పెట్టారని అన్నారు. ప్రకృతి కరుణించకపోయినా ప్రభుత్వం అయినా కరుణించి రైతులకు సాగునీరు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘాల అధ్యక్షులు డిసి వేగేశ్న భాస్కరరాజు, అల్లూరి రామకృష్ణంరాజు, ఎస్ సాయి రాజు, ధూళిపూడి గోపి, రాయుడు కొండ, ఇరిగేషన్ ఏఈ అనూష,అగ్రికల్చర్ ఏవో ప్రశాంతి,కౌలు రైతులు పలివెల శేషారావు,రెడ్డి శ్రీనివాసు, వళ్ళు చిన్న, గుబ్బల పండు, కన్నీటి లక్ష్మణరావు, కొప్పిశెట్టి శ్రీనివాసు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.