ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 1న గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలంలో పర్యటించనున్నారు.
Gudur: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జులై 1వ తేదీన చిల్లకూరు మండలం, పొన్నపరవారిపాలెం పర్యటించనున్న నేపధ్యంలో, ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. జులై 1న రాష్ట్ర ముఖ్యమంత్రి గూడూరు నియోజకవర్గం, పొన్న పరివారి పాలెం లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా రానున్న సందర్భంగా, మంగళవారం చిల్లకూరు మండలం, పున్నపువారిపాలెంలో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్,జేసి మొగిలి వెంకటేశ్వర్లులతో కలసి ఏర్పాట్లపై కలెక్టర్ హిమాన్షు శుక్లా పరిశీలించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి జిల్లా అధికారులకు వివిధ బాధ్యతలను అప్పగించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రణాళికా బద్దంగా గట్టి ఏర్పాట్లు చేయాలని విధులను కేటాయించిన అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు.. పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంభందిత అధికారులను ఆదేశించారు.హెల్త్ క్యాంపులు, హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు పక్కాగా వుండాలని, అలాగే త్రాగు నీటి కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్, బ్యారికేడింగ్ తదితర ఏర్పాట్లను ఆర్ అండ్ బి అధికారులు పటిష్టంగా చేపట్టాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లను పూర్తిచేసి విజయవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో నూతన పరిశ్రమలు రానున్నాయని తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాల వారిని ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చే అవకాశం ఉందని సుమారు 5000 నుంచి 7000 దాకా హాజరు కానున్నారని ఆయన తెలిపారు. గూడూరు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి ఫర్నిచర్ మరియు కృష్ణపట్నం పోర్టు సిటీ తదితరుములపై ముఖ్యమంత్రి రివ్యూ చేయనున్నారని, అలాగే నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నివేదికలు గౌరవ ముఖ్యమంత్రి కి సమర్పించనున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గూడూరు ఆర్డీవో అరుణ కుమారి, ఆత్మకూరు ఆర్డీవో పావని, మెప్మా పిడీ, కిరణ్ కుమార్, డిపివో వసుమతి, తెలుగు గంగ ప్రత్యేక అధికారులు వంశీకృష్ణ, కేశవర్ధన్ రెడ్డి, అన్ని శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పొన్నపరవారిపాలెంలో సీఎం పర్యటనకు సర్వం సిద్ధం.. కలెక్టర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 1న గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలంలో పర్యటించనున్నారు. Gudur: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జులై 1వ తేదీన చిల్లకూరు మండలం, పొన్నపరవారిపాలెం పర్యటించనున్న నేపధ్యంలో, ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. జులై 1న రాష్ట్ర ముఖ్యమంత్రి గూడూరు నియోజకవర్గం, పొన్న పరివారి పాలెం లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా రానున్న సందర్భంగా, మంగళవారం చిల్లకూరు మండలం, పున్నపువారిపాలెంలో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్,జేసి మొగిలి వెంకటేశ్వర్లులతో కలసి ఏర్పాట్లపై కలెక్టర్ హిమాన్షు శుక్లా పరిశీలించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి జిల్లా అధికారులకు వివిధ బాధ్యతలను అప్పగించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రణాళికా బద్దంగా గట్టి ఏర్పాట్లు చేయాలని విధులను కేటాయించిన అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు.. పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంభందిత అధికారులను ఆదేశించారు.హెల్త్ క్యాంపులు, హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు పక్కాగా వుండాలని, అలాగే త్రాగు నీటి కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్, బ్యారికేడింగ్ తదితర ఏర్పాట్లను ఆర్ అండ్ బి అధికారులు పటిష్టంగా చేపట్టాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లను పూర్తిచేసి విజయవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో నూతన పరిశ్రమలు రానున్నాయని తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాల వారిని ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చే అవకాశం ఉందని సుమారు 5000 నుంచి 7000 దాకా హాజరు కానున్నారని ఆయన తెలిపారు. గూడూరు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి ఫర్నిచర్ మరియు కృష్ణపట్నం పోర్టు సిటీ తదితరుములపై ముఖ్యమంత్రి రివ్యూ చేయనున్నారని, అలాగే నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నివేదికలు గౌరవ ముఖ్యమంత్రి కి సమర్పించనున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గూడూరు ఆర్డీవో అరుణ కుమారి, ఆత్మకూరు ఆర్డీవో పావని, మెప్మా పిడీ, కిరణ్ కుమార్, డిపివో వసుమతి, తెలుగు గంగ ప్రత్యేక అధికారులు వంశీకృష్ణ, కేశవర్ధన్ రెడ్డి, అన్ని శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

