Saturday, 30 May 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో గుప్త నిధుల కలకలం-రామాపురం చెరువు వద్ద అర్ధరాత్రి తవ్వకాలు..ఇద్దరు అరెస్ట్
- తిరుపతి

శ్రీకాళహస్తిలో గుప్త నిధుల కలకలం-రామాపురం చెరువు వద్ద అర్ధరాత్రి తవ్వకాలు..ఇద్దరు అరెస్ట్

శ్రీకాళహస్తిమండలంలోని రామాపురం చెరువు సమీపంలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన తవ్వకాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. నిధుల వేటలో భాగంగా దుండగులు క్షుద్ర పూజలు నిర్వహించి, భారీ గోతులను తవ్వడం సంచలనంగా మారింది. ఘటనా వివరాల్లోకి వెళ్తే సోమవారం తెల్లవారుజామున రామాపురం చెరువు కట్ట సమీపంలో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తూ తవ్వకాలు జరుపుతున్నట్లు స్థానికులు గమనించారు. అక్కడ పెద్ద గుంతను తవ్వి ఉండటమే కాకుండా, పక్కనే ఉన్న రాళ్లకు పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే శ్రీకాళహస్తి రూరల్ సీఐ ఇబ్రహీం తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ తవ్వకాలను పరిశీలించి, వివరాలు సేకరించారు. పోలీసులు రాకను గమనించిన కొందరు పరారవ్వగా, అనుమానిత ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో నిందితులు వదిలి వెళ్లిన రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలు వీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ తవ్వకాల వెనుక ఎవరి హస్తం ఉంది? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పట్టుబడిన వారిని ప్రశ్నిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సీఐ ఇబ్రహీం తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి మూఢనమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.