ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా పేద ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దాట్ల పృధ్వీరాజ్ ఇచ్చిన మాట మేరకు మంగళవారం విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు.దాట్ల పృధ్వీరాజ్ అన్న స్వర్గీయ దాట్ల సీతారామరాజు రెండవ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలంశమురమళ్ళ గ్రామంలో గల ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఐ. పోలవరం మండలానికి చెందిన సుమారు 13 మంది పేద ఎస్సీ విద్యార్థులకు మొత్తం రూ.40,000 ఆర్థిక సహాయాన్ని దాట్ల పృధ్వీరాజ్, కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల చేతుల మీదుగా అందజేశారు.
విద్యార్థుల విద్యాభ్యాసానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సహాయం అందించడం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు తెలిపారు.


