Punnami news (04-08-2026): 2 నాగిరెడ్డిపల్లె—మంటపంపల్లి మార్గంలోని చెత్త నుండి సంపద సృష్టి కేంద్రం సమీపంలో పేకాట నిర్వహిస్తున్న వారిపై మంగళవారం నందలూరు ఎస్ఐ వి. మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 8 మంది జూదరులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.27,300 నగదు మరియు 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై నందలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మల్లికార్జున రెడ్డి హెచ్చరించారు.

పేకాట స్థావరంపై నందలూరు పోలీసుల దాడి – 8 మంది అరెస్ట్