ఖమ్మం
(పున్నమి న్యూస్)
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన పెద్ది పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని వారికి ఓదార్పు పలికారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచే నాయకుడని పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.



