ధరూర్ మండల పరిధిలోని పెద్ద చింతరేవుల ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో ఆదివారం నాడు ఉత్తరాది మఠం ఉడిపి,పాలిమర్ పీఠాధిపతులు శ్రీ 1008 విద్యా దీశ తీర్థ శ్రీపాదుల వారు, శ్రీ 1008 విద్యా రాజేశ్వర తీర్థ శ్రీపాదుల వారు కామిక ఏకాదశి ప్రత్యేక పూజలు ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆద్య చక్రవర్తి కేశవాచార్యులు తెలిపారు. కామిక ఏకాదశి విశిష్టతను వివరిస్తూ కోరికలు నెరవేరుటకు ఈరోజు ఉపవాస దీక్ష చేసిన వారికి మహావిష్ణువు యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయని తెలిపారు.శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లిన నాలుగు నెలల కాలంలో వచ్చేతొలి ఏకాదశి కావడంతో దీనిని విశేషంగా పరిగణిస్తారని అన్నారు.శ్రీహరిని ఆరాధించటం తులసి దళాలతో పూజ,దానం చేయటం ఈ ఏకాదశి ప్రత్యేకతలు అని తెలిపారు.ఉపవాసం ఉండి దైవచింతనలో స్వామివారికి దగ్గరగా ఉండడం విశేష ఫలితం అని తెలిపారు.వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు పెద్ద చింతరేవుల అన్నప్రసాద కమిటీ వారిచే ఏర్పాటుచేసిన అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఉత్తరాది మఠం పీఠాధిపతులు సెప్టెంబర్ 25 వరకు పెద్ద చింతరేవులలో చాతుర్మాస్య దీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.ప్రతిరోజు రామాయణం,భాగవత ప్రవచనాలు కార్యక్రమం ఉదయం 10.30నుండి 11.30వరకు ఉంటున్నట్టు తెలిపారు.ఆలయ ఆవరణలో ప్రతిరోజు పవమాన హోమం, నవగ్రహ హోమం కోరిన భక్తులకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అర్చకులు ఆద్యవామనాచారి, ఆద్య కిష్టాచారి, ఆద్యమద్వాచారి,వివిధ ప్రాంతాల నుండి భక్తులు మహిళలు పాల్గొన్నారు.

పెద్ద చింతరేవులలో పీఠాధిపతులచే ఏకాదశి ప్రత్యేక పూజలు…