స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పుల్లంపేట జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయవాదులు, ప్రజలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు వర్ధనగారి ప్రసాద్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సమాజంలో ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పోతప్పి చిన్నయ్య, పసుపులేటి సుబ్బయ్య, మల్లెపల్లి రమణ పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రజలంతా కృషి చేయాలని వారు కోరారు.




