పున్నమి న్యూస్ కథనానికి స్పందన
ఫిర్యాదు చేసిన వెంటనే విద్యుత్ అధికారులు స్పందన – అక్రమ విద్యుత్ వినియోగంపై చర్యలు
(హనుమంతుని పాడు పున్నమి ప్రతినిధి)
హనుమంతునిపాడు మండలంలో అక్రమంగా విద్యుత్ వినియోగం జరుగుతోందని, దీనిపై సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం ఇటీవల పున్నమి న్యూస్ ద్వారా వెలుగులోకి వచ్చింది.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, 7111205000105 నంబర్ గల విద్యుత్ మీటర్ కాటినేని పాపయ్య పేరు మీద ఉంది. ఆయన అనుమతి లేకుండా ఈ కనెక్షన్ నుంచి విద్యుత్ తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అదేవిధంగా, మూలే శ్రీనివాసులు అనే వ్యక్తి బుసిరెడ్డి మాల్యాద్రి పేరుతో అగ్రిమెంట్ రాసుకుని, ప్రభుత్వ విద్యుత్ స్తంభం నుంచి నేరుగా విద్యుత్ తీసుకోవడంతో పాటు, 7111205000105 నంబర్ విద్యుత్ కనెక్షన్ నుంచి కూడా విద్యుత్ తీసుకుని ఒక షాప్‌కు కనెక్షన్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయంపై పున్నమి న్యూస్‌లో కథనం ప్రచురితమైన వెంటనే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, సంబంధిత అంశాన్ని పరిశీలించి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. ఆ షాపు లో ఉన్న దొంగ కనెక్షన్ ను కూడా తొలగించారు. వారిపై చర్యలు కూడా తీసుకున్నారు.
ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విద్యుత్ అక్రమ వినియోగానికి సంబంధించిన సమస్యను పరిష్కరించిన విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదుదారు కృతజ్ఞతలు తెలిపారు.
విద్యుత్ మీటర్ ఇతరుల పేరుపై ఉన్న సందర్భంలో, సంబంధిత వ్యక్తి అనుమతి లేకుండా విద్యుత్ వినియోగించడం, ప్రభుత్వ విద్యుత్ స్తంభాల నుంచి నేరుగా కనెక్షన్లు తీసుకోవడం వంటి అంశాలపై అధికారులు నిరంతరం నిఘా ఉంచి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Uploaded Video:






