వార్త ముఖ్యాంశాలు
- నాగుల చవితి సందర్భంగా ఘనంగా గంగానమ్మ, గౌరమ్మ దేవి, నందీశ్వరుల ఊరేగింపు నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కొట్టేటి కోట వీధిలో గంగానమ్మ, గౌరమ్మ దేవి, నందీశ్వరుల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
- దశాబ్దాలుగా పూర్వీకుల ఆచార సంప్రదాయాలను కొనసాగిస్తూ శ్రీ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
- ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ దేవాదాయ శాఖ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు.
నాగుల చవితి సందర్భంగా ఘనంగా గంగానమ్మ, గౌరమ్మ దేవి, నందీశ్వరుల ఊరేగింపు
నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కొట్టేటి కోట వీధిలో గంగానమ్మ, గౌరమ్మ దేవి, నందీశ్వరుల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దశాబ్దాలుగా పూర్వీకుల ఆచార సంప్రదాయాలను కొనసాగిస్తూ శ్రీ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ దేవాదాయ శాఖ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. అలాగే రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి షేక్ హయాత్ షరీఫ్, ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి పొదిలి చంటిబాబు, నజీర్, కెనడీ, ఎద్ధు సురేష్, డివిజన్ జనరల్ సెక్రటరీ రేవులగడ్డ విజయ్, దేవాలయ కమిటీ సభ్యులు శేఖర్, చంద్రశేఖర్, రామచంద్రరావు, మల్లికార్జునరావు, వినోద్, గురుతేజ, సాయి పలపల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. అనంతరం నిర్వహించిన ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కొట్టేటి కోట వీధిలో గంగానమ్మ, గౌరమ్మ దేవి, నందీశ్వరుల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దశాబ్దాలుగా పూర్వీకుల ఆచార సంప్రదాయాలను కొనసాగిస్తూ శ్రీ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ దేవాదాయ శాఖ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. అలాగే రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి షేక్ హయాత్ షరీఫ్, ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి పొదిలి చంటిబాబు, నజీర్, కెనడీ, ఎద్ధు సురేష్, డివిజన్ జనరల్ సెక్రటరీ రేవులగడ్డ విజయ్, దేవాలయ కమిటీ సభ్యులు శేఖర్, చంద్రశేఖర్, రామచంద్రరావు, మల్లికార్జునరావు, వినోద్, గురుతేజ, సాయి పలపల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. అనంతరం నిర్వహించిన ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, భక్తులకు శ్రీ రామాలయం కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.