Tuesday, 26 May 2026
  • Home  
  • పిల్లలు ఆయుధాలు కాదు.| డీఎన్‌ఏ పరీక్ష పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం
- ఆంధ్రప్రదేశ్

పిల్లలు ఆయుధాలు కాదు.| డీఎన్‌ఏ పరీక్ష పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం

పిత్రార్జిత ఆస్తిలో వాటా కోరిన కుమార్తెకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలన్న తండ్రి అభ్యర్థనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తప్పుబట్టింది. విజయనగరానికి చెందిన కనక మహాలక్ష్మి అనే మహిళ తన తండ్రి నరసయ్యరెడ్డి ఆస్తిలో భాగం కోరగా, ఆమె తన కూతురే కాదంటూ నిరూపించేందుకు డీఎన్‌ఏ పరీక్ష చేయించాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. బలమైన కారణం లేకుండా డీఎన్‌ఏ పరీక్షలు ఆదేశిస్తే పిల్లల భవిష్యత్తు, సామాజిక హోదా దెబ్బతింటుందని పేర్కొన్నారు. పిల్లలను ఆయుధాలుగా వాడుకోవద్దని హెచ్చరిస్తూ, ఇతర మార్గాల్లో సాక్ష్యాలు చూపాలంటూ పిటిషనర్‌కు రూ. 3,000 జరిమానా విధించారు.

పిత్రార్జిత ఆస్తిలో వాటా కోరిన కుమార్తెకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలన్న తండ్రి అభ్యర్థనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తప్పుబట్టింది. విజయనగరానికి చెందిన కనక మహాలక్ష్మి అనే మహిళ తన తండ్రి నరసయ్యరెడ్డి ఆస్తిలో భాగం కోరగా, ఆమె తన కూతురే కాదంటూ నిరూపించేందుకు డీఎన్‌ఏ పరీక్ష చేయించాలని ఆయన కోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. బలమైన కారణం లేకుండా డీఎన్‌ఏ పరీక్షలు ఆదేశిస్తే పిల్లల భవిష్యత్తు, సామాజిక హోదా దెబ్బతింటుందని పేర్కొన్నారు. పిల్లలను ఆయుధాలుగా వాడుకోవద్దని హెచ్చరిస్తూ, ఇతర మార్గాల్లో సాక్ష్యాలు చూపాలంటూ పిటిషనర్‌కు రూ. 3,000 జరిమానా విధించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.