అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పరిధిలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలతో పాటు మూగజీవాల పరిస్థితి దయనీయంగా మారింది.వర్షాల ప్రభావంతో గురువారం ఉదయం కొద్ది గంటల వ్యవధిలోనే రెండు గ్రామాలకు చెందిన గిరిజన రైతుల మూడు మేకలు మృతి చెందినట్లు రైతులు తెలిపారు.బోనూరు గ్రామం మాదెల అప్పన్నవి రెండు మేకలు,చిడిమెట్టు బద్నాయిన గంగులువి ఒక మేక మృతి చెందినట్లు తెలిపారు. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా మేకలు మృతి చెందడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని మూగజీవాలు మృతి చెందే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మృతి చెందిన మేకల వివరాలను నమోదు చేసి, బాధిత రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందించాలని కోరుతున్నారు.



