Monday, 27 July 2026
  • Home  
  • పారదర్శకత కోసమే 396 జి.ఒ నష్టం లేదన్న విజయం రాణి
- ఆంధ్రప్రదేశ్

పారదర్శకత కోసమే 396 జి.ఒ నష్టం లేదన్న విజయం రాణి

(జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో) ప్రజలకు పారదర్శకత తో కూడిన సేవలు అందించే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారే తప్ప మరో ఆలోచన లేదని నెల్లూరు 1 సబ్ రిజిస్ట్రార్ విజయ రాణి పేర్కొన్నారు. దీని వలన డాక్యుమెంట్ రైటర్స్ కు ఎలాంటి నష్టం ఉండబోదని ఆమె స్పష్టం చేశారు. సమ్మె చేస్తూ అనవసర దుష్ప్రచారం చేయడం పట్ల ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విధానం లో భాగంగా ప్రతి రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫ్రంట్ డెస్క్ ఏర్పాటు చేసి ప్రజల కు పూర్తి అవగాహన కల్పించడమే ఇందులో ప్రధాన ఆశయం అని తెలిపారు. డాక్యుమెంట్ రైటర్స్ సమ్మెతో సాధారణంగా జరిగే లావాదేవీల సంఖ్య తగ్గిందని, అయితే తనఖాలు వంటివి జరుగుతున్నాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకునే పార్టీలు తమ తమ పూర్తి వివరాలతో వస్తే రిజిస్ట్రేషన్ చేసేందుకు తమ కార్యాలయ‌ సిబ్బంది సహకరించేందుకు సిద్దంగా ఉందని విజయ రాణి తెలిపారు. ప్రజల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సహకరించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు.

(జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో)
ప్రజలకు పారదర్శకత తో కూడిన సేవలు అందించే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారే తప్ప మరో ఆలోచన లేదని నెల్లూరు 1 సబ్ రిజిస్ట్రార్ విజయ రాణి పేర్కొన్నారు.
దీని వలన డాక్యుమెంట్ రైటర్స్ కు ఎలాంటి నష్టం ఉండబోదని ఆమె స్పష్టం చేశారు. సమ్మె చేస్తూ అనవసర దుష్ప్రచారం చేయడం పట్ల ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విధానం లో భాగంగా ప్రతి రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫ్రంట్ డెస్క్ ఏర్పాటు చేసి ప్రజల కు పూర్తి అవగాహన కల్పించడమే ఇందులో ప్రధాన ఆశయం అని తెలిపారు. డాక్యుమెంట్ రైటర్స్ సమ్మెతో సాధారణంగా జరిగే లావాదేవీల సంఖ్య తగ్గిందని, అయితే తనఖాలు వంటివి జరుగుతున్నాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకునే పార్టీలు తమ తమ పూర్తి వివరాలతో వస్తే రిజిస్ట్రేషన్ చేసేందుకు తమ కార్యాలయ‌ సిబ్బంది సహకరించేందుకు సిద్దంగా ఉందని విజయ రాణి తెలిపారు. ప్రజల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సహకరించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.