ఖానాపురం మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ .మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నరసయ్య
ఈ సందర్భంగా ఖానాపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ- నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తీసుకువచ్చిన ప్రాజెక్టు ద్వారా పాకాల సరస్సు నిండుకుండలా ఉండాల్సింది నేడు అధికార పార్టీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే చేతకానితనం వల్ల ప్రాజెక్టు ద్వారా నీరు తీసుకురాలేకపోతున్నారు.పాకాల సరస్సులో నేడు 18.9 ఫీట్ల నీరు ఉన్న నీటిని విడుదల చేయడంలో అలసత్వం ఎందుకు వహిస్తున్నారో రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు గత ప్రభుత్వాల హయాంలో సరస్సులో 13 ఫీట్ల నీరు ఉన్నా కూడా వర్షాకాలం పంటకు సాగునీరు అందించి పంట పండించిన చరిత్ర ఉన్న పాకాలను నేడు స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్ల సరస్సులో నిండా నీరు ఉన్నా కూడా నీటిని విడుదల చేయకుండా మొద్దు నిద్ర వహిస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు పాకాల సరస్సులో 1.4 TMC నీరు నిల్వ ఉంది. 0.4 TMC నీటిని డెడ్ స్టోరేజ్ కింద ఉంచిన 01 టీఎంసీ నీటిని పంటలకు విడుదల చేయవచ్చు. ఇంత తెలివి లేని దద్దమ్మలు ప్రభుత్వాన్ని పాలించడం పాకాల ఆయకట్టు రైతుల దౌర్భాగ్యం. వర్షాకాలంలో 1 TMC కి 10 వేల నుండి 12 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. బిఆర్ఎస్ పార్టీ పోరాటం ద్వారా దిగివచ్చిన స్థానిక ఎమ్మెల్యే, ఐబీ అధికారులు రామప్ప దగ్గర ఏర్పాటు చేసిన రెండు మోటార్ల ద్వారా నిరంతరం నడిపించిన ఇప్పటికే పాకాల సరస్సు నిండేదని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి పోరాటం చేస్తుంటే గుడ్డెద్దు చేనులో పడ్డట్టు హుటాహుటిన భయపడి మోటార్లు ఆన్ చేసే ప్రభుత్వం రైతులపై ప్రేమ ఉందా లేదో తెలుపాలని డిమాండ్ చేశారు. నిరంతరాయంగా రెండు మోటార్లు కనీసం 40 రోజులు నడిపిస్తే 1TMC సాగునీటిని సరస్సులు ఊహించడం ద్వారా ఆయకట్టుకు నీరుచ్చే అవకాశాలు ఉంటాయి.పైన గోదావరి నది పుష్కలంగా ప్రవహించడంతో దేవాదుల ప్రాజెక్టు ద్వారా రామప్ప సరస్సులోకి నీరు వస్తున్నాయి. ఇక్కడ అధికారులను సమన్వయ చేసి నీళ్లు విడుదల చేసే నాయకుడు, నాయకత్వం మనం నర్సంపేట నియోజకవర్గంలో లేకపోవడం చాలా బాధాకరం.స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కరువు కాటకాల పరిస్థితుల్లో కూడ పాకాల ఆయకట్టు కింద రైతులు సాగు చేసే 35 వేల ఎకరాల కు రెండు పంటలు పండించి “రైతును రాజు” చేయాలని గొప్ప లక్ష్యంతో 336 కోట్ల రూపాయలతో ప్రాజెక్టును తీసుకువచ్చి ఒకసారి లక్ష ని పూర్తి చేసిన ఘనత పెద్దన్నకు దక్కిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన ఆనవాళ్ళతో,తను నేర్పిన పాఠంతో ఇదే పద్ధతిని అవలంభించాల్సిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నేడు పట్టి పట్టనట్లు రైతులు పట్టించుకోకపోవడం చాలా అన్యాయమని అన్నారు. ఇప్పటికే పాకాల ఆయకట్టు కింద రైతులు 25% నాట్లు పూర్తి చేసుకున్నారనీ, 25% వడ్లను విదజల్లే పద్ధతిని అవలంబించారని, ఇంకా 50% మంది రైతులు నారు పోసి దేవుడికి దీపం పెట్టినట్లు నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. నార్లు ముదిరిపోతున్నాయని, పంట పండే కార్తెలు ముగుస్తున్న మొద్దు ప్రభుత్వం, నాయకత్వం ఎందుకు స్పందించడం లేదని రైతులకు సమాధానం చెప్పాల్సిన స్థానిక ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడం లేదనే విషయాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ద్వారా రైతులకు చెప్పాలని డిమాండ్ చేశారు. రామప్ప నుండి పాకాల సరస్సుకు వచ్చే పైపులైన్ల ద్వారా ములుగు నియోజకవర్గానికి సాగునీటిని తీసుకు వెళ్తుంటే స్థానిక ఎమ్మెల్యే చేతకానితనం స్పష్టంగా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.మన ప్రాంతాన్ని సాగునీరు అందించకుండా నారుమడులను ఎండబెట్టి పక్క నియోజకవర్గానికి నీళ్లు పారిస్తున్న “పాలేరు లాగా ఎమ్మెల్యే” ఉన్నాడని మండిపడ్డారు.రాష్ట్రంలో ENC మీటింగ్ ప్రాజెక్టుల మీద జరిగితే పాకాల రామప్ప ప్రాజెక్టు మీద గళం విప్పే నాయకుడు లేకపోవడం ఈ ప్రాంత రైతులు చేసుకున్న పాపమని అన్నారు.రైతులు నీటి విడుదల కోసం కండ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తుంటే.. స్థానిక ఎమ్మెల్యే విహారయాత్రలు చేస్తున్నాడని మండిపడ్డారు.మన స్థానిక ఎమ్మెల్యే కు విహారయాత్రలు, షోయింగ్ రాజకీయాలు తప్ప రైతులకు ప్రజలకు పనికొచ్చే పని ఒకటి ఉండదని హేద్దేవా చేశారు.ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడు పనులు చేస్తాడని కలలు కంటుంటే.. కానీ నర్సంపేట నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఎన్నుకున్న ప్రజలనే నిండా ముంచుతుంటే వారు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, అధికారులు వెంటనే స్పందించి కష్టకాలంలో ఉన్న రైతాంగానికి నీటిని వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో అధికార పార్టీ నాయకత్వాన్ని జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్ ధర్మరావుపేట సర్పంచ్ మాడ్రాజు వెంకన్న,బీసీసెల్ అధ్యక్షుడు కోరే సుధాకర్, గ్రామ పార్టీ అధ్యక్షులు మచ్చిక అశోక్, ఉప సర్పంచ్ ఉప్పు రాజు, బోడ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు బానోతు శ్రీనివాస్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వడ్డే రాజశేఖర్, మాజీ సర్పంచులు తక్కలపల్లి రమేష్, బాదావత్ బాలకిషన్, భూక్య వెంకన్న, పార్టీ నాయకులు వల్లెపు శ్రీనివాస్, మౌలానా, వెజెల్ల కిషన్, జాటోత్ బాలు నాయక్, నాగుల్ మీరా, నేలమర్రి నాగరాజు, తరాల శ్రీనివాస్,నవీన్,సుధాగానీ మురళి, తూనం నాగరాజు, ఆకుల లక్ష్మణ్, ఓర్సు రవి, అన్నబోయిన శ్రీనివాస్, గోడిశాల రాంబాబు, బొల్లం హరీష్, జానీమియా తదితరులు పాల్గొన్నారు.



