పసుపు సాగులో యాజమాన్య పద్ధతులు మరియు సస్యరక్షణ పై అవగాహన సదస్సు…
ఉద్యాన అధికారి,మైదుకూరు.
ఖాజీపేట ప్రతినిధి
ఖాజీపేట మండలం, నాగసానిపల్లె గ్రామంలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో గురువారం పసుపు సాగుపై రైతుశిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి M. హరిప్రసాద్ , కె.వి కె ఊటుకూరు ఉద్యాన శాస్రవేత్త మానస,ఉద్యాన అధికారి మైదుకూరు సి.రామకృష్ణ పాల్గొన్నారు.జిల్లా ఉద్యాన అధికారి బిందుసేద్యం, సేంద్రియ ఎరువుల వాడకం,ఎత్తు మడుల పద్ధతుల గురించి వివరించారు. ఉద్యాన శాస్త్రవేత్త మానసగారు పసుపు సాగులో విత్తన శుద్ధి, ఎరువుల యాజమాన్యం,కలుపు నివారణ,జీవన ఎరువుల ప్రాముఖ్యత మరియు దుంపకుళ్ళు ,దుంప పుచ్చు నివారణ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఉద్యాన శాఖ అధికారి ఉద్యాన శాఖ ద్వారా అందు రాయితీల గురించి,వెదురు సాగు గురించి, వివరించారు.ఈ కార్యక్రమంలో నాగసానిపల్లి గ్రామ ఉద్యాన సహాయకురాలు D.జ్యోష్ణ మరియు రైతులు పాల్గొన్నారు.




