పున్నమి: రంగారెడ్డి జిల్లా: మిర్యాలగూడ నుంచి బదిలీపై వచ్చి రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సీనియర్ సివిల్ జడ్జి పి. పవన్ కుమార్ను సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది కిక్కర గోపీ శంకర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పలు సామాజిక అంశాలతో పాటు ప్రజలకు అందుబాటులో ఉన్న న్యాయ సేవలు, న్యాయ సహాయం తదితర అంశాలపై ఇరువురు చర్చించారు.
ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి పి. పవన్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి పౌరుడు న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా వివాదాలను సాధ్యమైనంత వరకు రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం ద్వారా విలువైన సమయం, డబ్బు ఆదా అవుతాయని తెలిపారు. “రాజీ మార్గమే రాజా మార్గం” అనే విషయాన్ని ప్రజలు గుర్తించి, అందుబాటులో ఉన్న న్యాయ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్ మాట్లాడుతూ, ప్రజలకు న్యాయ అవగాహన కల్పించడంతో పాటు సామాజిక సమస్యల పరిష్కారానికి తమ సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సురక్ష సేవా సంఘం క్రియాశీలక సభ్యులు, న్యాయవాదులు శ్రీమతి ఏకే పూర్ణిమ, సంగారెడ్డి జిల్లా సురక్ష ఇన్చార్జి శ్రీమతి హారతి, సురక్ష సభ్యులు యాకూబ్, బొడుసు పవన్ కుమార్ యాదవ్, నాగేశ్వరి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



