శ్రీ కాళహస్తి, మే 27, (పున్నమి న్యూస్) : భారత తొలి ప్రధాని, భారతరత్న జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. దామోదరం రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుడు, పంచవర్ష ప్రణాళికల రూపకర్తగా నెహ్రూ దేశ అభివృద్ధికి విశేష సేవలు అందించారని కొనియాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశ ప్రగతికి పునాది వేశాయని తెలిపారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందనే దృక్పథంతో బాలలకు ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్య అందించేందుకు కృషి చేశారని, ఉన్నత విద్యాభివృద్ధి కోసం ఐఐటీలు, మెడికల్ కాలేజీల స్థాపనకు నాంది పలికారని పేర్కొన్నారు. నెహ్రూ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి, పట్టణ యువజన అధ్యక్షుడు ఆంటోనీతో పాటు నాయకులు నాగరాజు, మహేష్, అరుణ్, మాస్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

నెహ్రూ ఆశయాలు యువతకు స్ఫూర్తి-దామోదరం రెడ్డి